- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత్‌తో టెస్టు సిరీస్‌కు హ్యారీ బ్రూక్ దూరం
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియాతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో హ్యారీ బ్రూక్ భారత్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడని ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఆదివారం వెల్లడించింది. అబుదాబిలో ట్రైనింగ్ క్యాంప్ నుంచి హ్యారీ బ్రూక్ తిరిగి ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నాడు. భారత్ పర్యటనకు అతను దూరమవడం ఇంగ్లాండ్ జట్టుకు భారీ లోటే. 2022లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన అతను ఇంగ్లాండ్ టెస్టు జట్టులో కీలక ప్లేయర్‌గా మారాడు. 12 టెస్టు మ్యాచ్‌ల్లో 62.16 సగటుతో 1,181 పరుగులు చేశాడు. అందులో నాలుగు సెంచరీలు ఉండటం విశేషం. మరోవైపు, హ్యారీ బ్రూక్ స్థానాన్ని బ్యాటర్ డాన్ లారెన్స్ భర్తీ చేయనున్నాడు. 2022లో వెస్టిండీస్‌తో చివరి టెస్టు ఆడిన అతను.. బ్యూక్ తప్పుకోవడంతో తిరిగి జట్టులో చోటు దక్కింది. 11 మ్యాచ్‌ల్లో డాన్ లారెన్స్ 29 సగటుతో 551 పరుగులు చేశాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఈ నెల 25 నుంచి 29 వరకు హైదరాబాద్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం బెన్ స్టోక్స్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు ఆదివారం హైదరాబాద్‌కు చేరుకుంది.