నేటి నుంచి భారత్ VS ఆసీస్ రెండో టెస్ట్

by Sathputhe Rajesh |
నేటి నుంచి భారత్ VS ఆసీస్ రెండో టెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలిటెస్ట్ మ్యాచ్ గెలుపుతో ఊపు మీద ఉన్న టీమిండియా రెండో టెస్ట్‌లో నేడు ఆసీస్‌తో తలపడనుంది. పూజారా వందో టెస్ట్ ఆడుతున్న వేళ, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి శ్రీకారం చుట్టిన చోట ఈ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఉదయం 9.30గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఈ స్పిచ్ సైతం స్పిన్నర్లకే అనుకూలమని క్యూరేటర్లు తెలిపారు.

ఈ స్పిచ్‌పై భారత్ ఆడిన 24 టెస్ట్ ల్లో 20 గెలవగా 4 మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి. కాగా జడేజా ఒక్క వికెట్ పడగొడితే 250 వికెట్ల మైలురాయిని చేరుకోనున్నాడు. 1996లో మొట్టమొదటి సారిగా బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇక్కడే తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియాతో 2013లో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో భారత్ గెలిచింది. అప్పుడు కూడా జడేజా, అశ్విన్ లు మ్యాచ్ ను భారత్ వైపు తిప్పడంలో కీలక పాత్ర పోషించారు. ఈ స్పిచ్‌‌లో అశ్విన్ 20.11 సగటుతో 27 వికెట్లు పడగొట్టాడు. కాగా సూర్య స్థానంలో శ్రేయస్ మళ్లీ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

Advertisement

Next Story