భారత్ - శ్రీలంక తొలి వన్డే మ్యాచ్ టై

by Gantepaka Srikanth |
భారత్ - శ్రీలంక తొలి వన్డే మ్యాచ్ టై
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ - శ్రీలంక మధ్య కొలంబో వేదికగా జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్ టై అయింది. శ్రీలంక నిర్దేశించిన 230 పరుగుల టార్గెట్‌ను టీమిండియా ఛేదించలేకపోయింది. 47.5 ఓవర్లలో కేవలం 230 పరుగులే చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ(58)తో రాణించారు. అక్షర్ పటేల్(33), కేఎల్ రాహుల్(31), శివం దూబే(25), కోహ్లీ(24), అయ్యర్(23) రాణించి పరవాలేదు అనిపించినా విజయాన్ని అందించలేకపోయారు. కాగా, వన్డే క్రికెట్ చరిత్రలో ఇది 44వ టై మ్యాచ్ కావడం గమనార్హం.

Advertisement

Next Story