- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎదురులేని యువ భారత్.. హాకీ జూనియర్ ఆసియా కప్‌లో సెమీస్‌కు
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : ఒమన్‌లో జరుగుతున్న హాకీ పురుషుల జూనియర్ ఆసియా కప్‌లో యువ భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. టోర్నీలో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత్ గ్రూపు దశను అజేయంగా ముగించింది. ఆదివారం జరిగిన చివరి గ్రూపు మ్యాచ్‌లో సౌత్ కొరియాపై 1-8 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో భారత్‌దే పూర్తి ఆధిపత్యం. అర్ష్‌దీప్ మూడు, అరైజీత్ రెండు గోల్స్‌తో జట్టుకు భారీ విజయాన్ని కట్టబెట్టారు. గుర్జోత్, రోసన్, రోహిత్ చెరో గోల్ చేశారు. కొరియా తరపున కిమ్ టి చేసిందే ఏకైక గోల్. టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా నాలుగో విజయం. గ్రూపు ఏలో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్ రౌండ్‌కు చేరుకుంది. ఈ నెల 3న జరిగే సెమీస్‌లో మలేసియాతో యువ భారత్ తలపడనుంది.
Advertisement
Next Story