Sports News : పాక్ ఆటగాళ్లకు వీసా నిరాకరించిన భారత్

by M.Rajitha |
Sports News : పాక్ ఆటగాళ్లకు వీసా నిరాకరించిన భారత్
X

దిశ, వెబ్ డెస్క్ : త్వరలో భారత్-పాకిస్తాన్(Bharath-Pak) మధ్య జరగనున్న ఆసియా కప్ యూత్ స్క్రాబుల్ ఛాంపియన్‌షిప్(Asia Cup Youth Scrabble Championship) , ఢిల్లీ కప్(Delhi Cup) లో పాల్గొనే చాలా మంది పాకిస్తానీ ఆటగాళ్లకు వీసాలు ఇచ్చేందుకు భారత హైకమిషన్ నిరాకరించింది. పాక్ ఆటగాళ్లు రెండు నెలల ముందుగానే దరఖాస్తులు సమర్పించినప్పటికీ.. వారిలో చాలామంది ఆటగాళ్లకు వీసాలు జారీ చేయబోమని భారత హైకమిషన్ ధృవీకరించింది. ఇప్పటికే భారత్-పాక్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండగా.. ఈ వీసాల నిరాకరణ వలన పరిస్థితి మరింత దిగజారుతుందని ప్రపంచ క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా వచ్చే ఏడాది పాక్ లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో భారత పురుషుల క్రికెట్ జట్టు పాల్గొనడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే భారత జట్టును పాకిస్థాన్ పంపకూడదనే నిర్ణయాన్ని బీసీసీఐ(BCCI) ఇప్పటికే ఐసీసీ(ICC)కి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB)కి తెలియజేసింది. మొత్తం టోర్నమెంట్‌ను పాకిస్థాన్ లోనే నిర్వహించాలని PCB నిశ్చయించుకున్నప్పటికీ, హైబ్రిడ్ ఫార్మాట్‌ లో జరపాలని భారత బోర్డు సూచించింది. అయితే, టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే హక్కులను కలిగి ఉన్న పాకిస్థాన్ బోర్డు ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

Advertisement

Next Story