World Cup 2023 : వన్డే వరల్డ్ కప్‌లో భారత్ రికార్డుల మోత

by Mahesh |   ( Updated:2023-11-13 02:37:42.0  )
World Cup 2023 : వన్డే వరల్డ్ కప్‌లో భారత్ రికార్డుల మోత
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు విజయ యాత్రను కొనసాగిస్తుంది. లిగ్ స్టేజిలో ఆదివారం జరిగిన చివరి మ్యాచ్ లో భారత జట్టు నెదర్లాండ్స్ పై 160 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్ ఖాతాలో ఈ వరల్డ్ కప్ లో 9వ విజయం చేరింది. దీంతో భారత్ వరల్డ్ కప్ లో రికార్డులను బ్రేక్ చేసింది. 2003 సంవత్సరంలో వరుసగా 8 మ్యాచులు నెగ్గిన భారత్.. ఈ సీజన్ లో 9 విజయాలతో తన రికార్డును తానే బద్దలు కొట్టింది. అయితే మొత్తంగా చూసుకుంటే ఆస్ట్రేలియా జట్టు వరుసగా 11 మ్యాచుల్లో గెలిచింది. 2003, 2007 సంవత్సరాల్లో కంగారుల జట్టు ఈ రికార్డులను కలిగిఉంది. అయితే రానున్న సెమీస్, అలాగే.. ఫైనల్ మ్యాచ్ లో భారత్ గెలిస్తే ఆస్ట్రేలియా రికార్డులు సమం అవుతాయి.

Advertisement

Next Story