- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెలరేగిన భారత బౌలర్లు.. తక్కువ స్కోరుకే బంగ్లా ఆలౌట్
దిశ, వెబ్‌డెస్క్: షేర్-ఎ-బంగ్లా వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్నరెండో టెస్టు మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా భారీ స్కోర్ చేయాలని ప్లాన్ చేసింది. ప్రారంభంలోనే భారత బౌలర్లు చెలరేగడంతో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు చేతులెత్తేసారు. బంగ్లాదేశ్‌ను 73.5 ఓవర్లలో 227 పరుగులకు భారత్ ఆలౌట్ చేసింది.
బంగ్లా ఓపెనర్లు నజ్ముల్ హుస్సేన్ శాంటో (24) జాకీర్ హసన్ (15) పరుగులతో వెనుదిరిగారు. ఆ తర్వాత హక్ వచ్చిన మోమినుల్ (84) పరుగులు చేసి పర్వలేదని పించాడు. ముష్ఫికర్ రహీమ్ (26) ఔట్ కాగా..లిట్టన్ దాస్ (15) పరుగులకే మైదానాన్ని విడిచాడు. మిగతా ప్లేయర్లు కూడా ఎక్కువ పరుగుల రాణించకపోవడంతో 227 పరుగులకు బంగ్లా ఆలౌట్ అయింది. ఇక భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ చెరో నాలుగు వికెట్ తీశారు. జయదేవ్ ఉనద్కత్ రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 19/0 పరుగులతో ఉంది.