Asian Games: వరుసగా నాలుగో విజయం సాధించిన భారత మహిళల హాకీ జట్టు..

by Vinod kumar |   ( Updated:2023-10-05 15:47:08.0  )
Asian Games: వరుసగా నాలుగో విజయం సాధించిన భారత మహిళల హాకీ జట్టు..
X

దిశ, వెబ్‌డెస్క్: Asian Gamesలో ఆసియాక్రీడలు 2023లో భారత మహిళల హకీ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. హాంకాంగ్‌తో జరిగిన చివరి పూల్ మ్యాచ్‌లో భారత జట్టు 13-0తో విజయం సాధించింది. భారత జట్టులో వందనా కటారియా, దీపికా, దీప్‌ గ్రేస్‌ ఎక్కా తలా మూడు గోల్స్‌తో అదరగొట్టారు. సంగీతా కుమారి రెండు గోల్స్‌, నవనీత్‌ కౌర్ ఒక్క గోల్‌ సాధించారు. పూల్‌-ఎలో భారత మహిళ జట్టు 4 విజయాలు సాధించి 10 పాయింట్లతో అగ్ర స్ధానంలో నిలిచింది. కాగా ప్రతీ పూల్‌ నుంచి మొదటి రెండు స్ధానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. ఇక గురువారం జరగనున్న సెమీ ఫైనల్‌లో పూల్-బి రన్నరప్‌తో భారత్ తలపడనుంది.

Advertisement

Next Story

Most Viewed