భారత ఏ జట్టుకు తెలుగమ్మాయిలు యశశ్రీ, షబ్నమ్ షకీల్ ఎంపిక

by Harish |
భారత ఏ జట్టుకు తెలుగమ్మాయిలు యశశ్రీ, షబ్నమ్ షకీల్ ఎంపిక
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే నెలలో భారత మహిళల క్రికెట్ ‘ఏ’ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టు‌తో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు బీసీసీఐ ఆదివారం భారత ‘ఏ’ జట్టును ప్రకటించింది. 18 మందితో కూడిన జట్టును వెల్లడించింది. ఈ జట్టుకు మిన్ను మణిని కెప్టెన్‌గా నియమించగా.. శ్వేతా సెహ్రావత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. జట్టులో తెలుగమ్మాయి‌లు ఎస్.యశశ్రీ, షబ్నమ్ షకీల్‌కు చోటు దక్కింది. షబ్నమ్ షకీల్ ఎంపిక ఫిట్‌నెస్‌కు లోబడి ఉంటుందని బోర్డు పేర్కొంది. ఇటీవల సొంతగడ్డపై జరిగిన సౌతాఫ్రికాతో మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు ఆమె ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కలేదు. గతేడాది అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో యశశ్రీ, షబ్నమ్ షకీల్‌ సభ్యులు. కాగా, ఆగస్టు 7 నుంచి 22 వరకు మల్టీ ఫార్మాట్ షెడ్యూల్ ఖరారైంది. అందులో ఆగస్టు 7, 9, 11 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లు.. ఆగస్టు 14, 16, 18 తేదీల్లో వన్డేలు జరగనున్నాయి. ఆగస్టు 22 నుంచి 25 వరకు నాలుగో రోజుల మ్యాచ్ జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed