Asia Cup- India A: ఆసియా కప్‌-2023 జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడుకి చోటు

by Vinod kumar |
Asia Cup- India A: ఆసియా కప్‌-2023 జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడుకి చోటు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏసీసీ మెన్స్‌ ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌-2023కి ఇండియా- ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ టోర్నీకి జూనియర్‌ క్రికెట్‌ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. మరో నలుగురికి స్టాండ్‌ బై ప్లేయర్లుగా అవకాశమిచ్చింది. యశ్‌ ధుల్‌ ఇండియా- ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. అభిషేక్‌ శర్మ వైస్‌కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. తెలుగు క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌రెడ్డి సైతం జట్టులో చోటు దక్కించుకున్నాడు. జూలై 13 నుంచి జూలై 23 వరకు శ్రీలంకలోని కొలంబోలో ఎమర్జింగ్‌ ఆసియా కప్‌-2023 నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. గ్రూప్‌-బిలో భారత్‌తో పాటు.. నేపాల్‌, యూఏఈ, పాకిస్తాన్‌- ఏ జట్లు ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, ఒమన్‌- ఏ జట్లు గ్రూప్‌-ఏలో ఉన్నాయి. జూలై 23న ఈ టోర్నీ ఫైనల్‌ జరుగనుంది.

ఎమర్జింగ్‌ ఏసియా కప్‌-2023 ఇండియా- ఏ జట్టు:

సాయి సుదర్శన్‌, అభిషేక్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), నికిన్‌ జోస్‌, ప్రదోష్‌ రంజన్‌ పాల్‌, యశ్‌ ధుల్‌(కెప్టెన్‌), రియాన్‌ పరాగ్‌, నిశాంత్‌ సంధు, ప్రభ్‌షిమ్రన్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌), ధ్రువ్‌ జురెల్‌(వికెట్‌ కీపర్‌), మానవ్‌ సుతార్‌, యువరాజ్‌సిన్హ్‌ దోడియా, హర్షిత్‌ రానా, ఆకాశ్‌ సింగ్‌, నితీశ్‌ కుమార్‌రెడ్డి, రాజ్‌వర్దన్‌ హంగ్రేకర్‌.

స్టాండ్‌ బై ప్లేయర్లు:

హర్ష్‌ దూబే, నేహాల్‌ వధేరా, స్నెల్‌ పటేల్‌, మోహిత్‌ రేద్కార్‌.

Advertisement

Next Story

Most Viewed