IND Vs ZIM: నేడు భారత్, జింబాబ్వే మధ్య తొలి టీ 20 సమరం.. జోష్‌ మీదున్న కుర్రాళ్లు

by Shiva |
IND Vs ZIM: నేడు భారత్, జింబాబ్వే మధ్య తొలి టీ 20 సమరం.. జోష్‌ మీదున్న కుర్రాళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2024 కైవసం చేసుకున్న టీమిండియా మరో టీ20 సమరానికి సన్నద్ధమైంది. 5 మ్యాచ్‌లో టీ20 సీరిస్‌లో భాగంగా భారత్, జింబాబ్వే తలపడబోతోంది. ఇవాళ సాయంత్రం హరారే స్పోర్ట్ క్లబ్ వేదికగా సాయంత్రం 4.30కి తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్ కప్ టీమిండియా వశం అవ్వడంతో జూనియర్లకు అవకాశం కల్పిచేందుకు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు టీ20 ఫార్మాట్‌కు విడ్కోలు పలికారు. దీంతో బీసీసీఐ ఐపీఎల్‌లో చక్కని ఆట తీరుతో అదరగొట్టిన ప్లేయర్లను జింబాంబ్వే టీ20 సిరీస్‌‌కు ఎంపిక చేసింది. జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీగా వ్యవహరించనున్నాడు. కాగా, వరల్డ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగుతున్న ఇండియా తరఫున తొలి మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సన్ రైజర్స్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేయనున్నారు. అదేవిధంగా మరో స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ మూడో స్థానంలో రానున్నాడు.

అభిషేక్ శర్మ ఈ ఏడాది ఐపీఎల్లో సన్ రైజర్స్ తరఫున చెలరేగిపోయాడు. అతడు 16 మ్యాచ్ లలో ఏకంగా 204.22 స్ట్రైక్ రేట్ తో 484 రన్స్ చేశాడు. అతనితోపాటు రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ లాంటి వాళ్లు కూడా టీ20ల్లో ఇండియా తరఫున అరంగేట్రం చేయనున్నారు. పరాగ్ కూడా ఈ ఏడాది ఐపీఎల్లో 15 మ్యాచ్ లలో 149 స్ట్రైక్ రేట్ తో 573 రన్స్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉన్న కేవలం ఐదుగురు ప్లేయర్స్ రింకు సింగ్, శివమ్ దూబె, యశస్వి జైస్వాల్, ఖలీల్ అహ్మద్, సంజూ శాంసన్ మాత్రమే జింబాబ్వే పర్యటనలో ఉన్నారు. వీళ్లలోనూ దూబె, జైస్వాల్, సంజూ ఇంకా జింబాబ్వే వెళ్లలేదు. దీంతో తొలి రెండు టీ20లకు వీళ్లు అందుబాటులో ఉండరు. వీళ్ల స్థానంలో జితేష్ శర్మ, హర్షిత్ రాణా, సాయి సుదర్శన్ ఉంటారు. మూడో టీ20 నుంచి వాళ్లు తిరిగి వస్తారు.

Advertisement

Next Story

Most Viewed