IND VS WI 1st Test Day 3: అదరగొడుతున్న యశస్వి.. తొలి భారత క్రికెటర్‌గా..

by Vinod kumar |
IND VS WI 1st Test Day 3: అదరగొడుతున్న యశస్వి.. తొలి భారత క్రికెటర్‌గా..
X

దిశ, వెబ్‌డెస్క్: విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పూర్తి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. మూడో రోజు ఆట ప్రారంభం కాగానే ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ యశస్వి 150 పరుగుల మార్కును దాటేశాడు. మూడో రోజు ఆట ప్రారంభం కాగానే జేసన్‌ హోల్డర్‌ వేసిన మూడో ఓవర్లో బౌండరీ, సింగల్‌ బాది యశస్వి 150 పరుగుల మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో అతను టెస్ట్‌ డెబ్యూలో 150 పరుగుల మార్కును అందుకున్న ఐదో అతి పిన్న వయస్కుడిగా, అతి చిన్న వయసులో ఈ ఫీట్‌ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

యశస్వి 21 సంవత్సరాల 196 రోజుల వయసులో టెస్ట్‌ అరంగేట్రంలో 150 పరుగుల మార్కును దాటగా.. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా పాక్‌ మాజీ క్రికెటర్‌ జావిద్‌ మియాందాద్‌‌పై ఉండేది. మియాందాద్‌.. 19 ఏళ్ల 119 రోజుల వయసులో తన తొలి టెస్ట్‌లో 150 పరుగుల మార్కును దాటాడు.

121 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 330/2గా ఉంది. యశస్వి (156)కి జతగా విరాట్‌ కోహ్లి (41) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్‌ (5), జడేజా (3) విండీస్‌ పతనాన్ని శాసించారు. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (103) శతక్కొట్టగా.. శుభ్‌మన్‌ గిల్‌ (6) విఫలమయ్యాడు.

Advertisement

Next Story

Most Viewed