Ind Vs Ire: ఐర్లాండ్‌తో తొలి టీ20.. అరుదైన ఘటన! ఒకే సారి ఐదుగురు..

by Vinod kumar |
Ind Vs Ire: ఐర్లాండ్‌తో తొలి టీ20.. అరుదైన ఘటన! ఒకే సారి ఐదుగురు..
X

దిశ, వెబ్‌డెస్క్: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జస్‌ప్రీత్‌ బుమ్రా సారథ్యంలోని యువ జట్టు ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి టీ20 సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా తరఫున ఏకంగా ఐదుగురు లెఫ్టాండ్‌ బ్యాటర్లు స్టేడియంలోకి దిగారు. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన రింకూ సింగ్‌తో పాటు తుది జట్టులో చోటు దక్కించుకున్న ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌, తిలక్‌ వర్మ, శివం దూబే, వాషింగ్టన్‌ సుందర్‌.. ఇలా వీళ్లంతా ఎడమచేతి వాటం కలిగిన బ్యాటర్లే కావడం విశేషంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ బుమ్రా తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే పేస్‌ దళ నాయకుడు బుమ్రా(2 వికెట్లు)తో పాటు అరంగేట్ర(టీ20) ఫాస్ట్‌బౌలర్‌ ప్రసిద్‌ కృష్ణ(2), అర్ష్‌దీప్‌ సింగ్‌(1) చెలరేగారు.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులకు పరిమతమైంది. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ, రవి బిష్ణోయ్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్‌ సింగ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. ఐర్లాండ్‌ బ్యాటర్లలో (51 నాటౌట్‌), కర్టిస్‌ క్యాంఫర్‌ (39)రాణించగా.. మిగతావారంతా విఫలమయ్యారు. ఆండ్రూ బల్బిర్నీ (4), పాల్‌ స్టిర్లింగ్‌ (11), లోక్కాన్‌ టక్కర్‌ (0), హ్యారీ టెక్టార్‌ (9), జార్జ్‌ డాక్రెల్‌ (1), మార్క్‌ అదైర్‌ (16) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ఆఖర్లో.. ముఖ్యంగా అర్షదీప్‌ వేసిన చివరి ఓవర్లో మెక్‌కార్తీ చెలరేగి ఆడాడు. అ ఓవర్‌లో అతను ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు. ఇందులో 2 సిక్సర్లు, ఓ బౌండరీ ఉంది. ఆఖరి బంతికి సిక్సర్‌ బాదిన మెక్‌కార్తీ తన హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

ఐర్లాండ్‌తో తొలి టీ20లో భారత తుది జట్టు:

జస్‌‍ప్రీత్‌ బుమ్రా (కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైశ్వాల్‌, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ , ప్రసిద్‌ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్.

Advertisement

Next Story