Ap News: పవన్ కల్యాణ్ టీంలోకి ఆమ్రపాలి..?

by srinivas |
Ap News: పవన్ కల్యాణ్ టీంలోకి ఆమ్రపాలి..?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) టీంలోకి ఆమ్రపాలి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. డీఓపీటీ(Dopt) ఆదేశాల మేరకు తెలంగాణ(Telangana) నుంచి ఏపీ(Ap)కి వచ్చిన నలుగురు ఐఏఎస్‌లలో ఆమ్రపాలి ఉన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ నుంచి రిలీవ్ అయిన ఆమె బుధవారమే ఏపీకి చేరుకున్నారు. గురువారం ఉదయం రాష్ట్ర సీఎస్ నీరబ్ కుమార్‌(CS Nirab Kumar)కు రిపోర్టు చేశారు. దీంతో ఆమెకు కేటాయించే పదవిపై చర్చ మొదలైంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టీంలోకి ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి(IAS Offiecr Amrapali) ని నియమించనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed