మిల్కీబ్యూటీ తమన్నాకు షాకిచ్చిన ఈడీ.. అస్సాంలో సీక్రెట్‌గా విచారణ.. ఎందుకంటే?

by saikumar |   ( Updated:2024-10-17 19:22:54.0  )
మిల్కీబ్యూటీ తమన్నాకు షాకిచ్చిన ఈడీ.. అస్సాంలో సీక్రెట్‌గా విచారణ.. ఎందుకంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో : టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియాకు ఈడీ షాకిచ్చింది. అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతిలో మనీలాండరింగ్ (PMLA) కేసుకు సంబంధించి నటి తమన్నా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం ప్రశ్నించింది. బిట్‌కాయిన్‌లు, ఇతర క్రిప్టోకరెన్సీల సాకుతో పలువురు పెట్టుబడిదారులను 'HPZ టోకెన్' మొబైల్ యాప్‌ నిర్వాహకులు మోసం చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ మేరకు మోసపోయిన పలువురు బాధితులు ఆ యాప్ నిర్వాహకుల మీద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

అయితే, ఈ యాప్ ఆర్గనైజ్ చేసిన ఓ ఈవెంట్‌కు తమన్నా భాటియా హాజరయ్యారు.సెలబ్రెటీ స్టేటస్ హోదాలో హాజరయ్యేందుకు డబ్బులు (రెమ్యునరేషన్) తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈడీ అధికారులు ఆమె సీక్రెట్‌గా విచారించినట్లు తెలుస్తోంది. కాగా, ఆమెపై ఎటువంటి అభియోగాలు మోపలేదని సమాచారం. కానీ, యాప్‌కు సంబంధించి, నిర్వాహకులతో ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో ఆమెను పలుమార్లు ఈడీ విచారణకు పిలవుగా.. షూటింగ్ వర్క్ వలన ఆమె విచారణకు హాజరుకాలేదని తెలిసింది. కాగా, ఈ యాప్‌ను 76 చైనీస్-నియంత్రిత సంస్థలతో సహా మొత్తం 299 ఎంటిటీలు, 10 మంది డైరెక్టర్లు చైనీస్ మూలానికి చెందినవారు ఉన్నారు. మరో 2 సంస్థలు ఇతర విదేశీ పౌరులచే నియంత్రించబడుతున్నాయి. మార్చిలో ED దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో యాప్ నిర్వాహకులను నిందితులుగా చేర్చింది.

Advertisement

Next Story