- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Layoffs: చైనా, యూరప్‌లలో వేలాది మంది ఉద్యోగుల లేఆఫ్స్ ప్రకటించిన నోకియా
దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ కంపెనీల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియ మొదలైంది. టెక్ కంపెనీ నోకియా గురువారం లేఆఫ్స్‌ను ప్రకటించింది. చైనాలో సుమారు 2,000 మందిని తొలగించాలని నిర్ణయించింది. ఖర్చులను తగ్గించే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. చైనాతో పాటు యూరప్‌లోనూ మరో 350 మందిని తీసేస్తున్నట్టు వెల్లడించింది. గతేడాది డిసెంబర్ నాటికి గ్రేటర్ చైనాలో మొత్తం 10,400 మంది ఉద్యోగులు ఉండగా, యూరప్‌లో 37,400 మంది ఉన్నారు. ఖర్చులు తగ్గించడంతో పాటు 2026 నాటికి కంపెనీ సుమారు 868 మిలియన్ డాలర్ల నుంచి 1.2 బిలియన్ డాలర్ల(రూ. 7,300- 10 వేల కోట్లు) ఆదా చేయాలని నోకియా భావిస్తోంది. దీనికోసం గతేడాదిలోనే 14,000 మంది వరకు ఉద్యోగులను తగ్గించే ప్రణాళికను వెల్లడించింది. ఇక, మరో టెక్ కంపెనీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మెటా తన ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్ సహా వివిధ టెక్ విభాగాల్లో లేఆఫ్స్‌ను ప్రకటించింది. ఎంతమందిని తొలగించనున్నది స్పష్టత ఇవ్వనప్పటికీ అన్ని వ్యాపారాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు కంపెనీ సిద్ధమైంది.