- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేగంగా ప్లేట్ లెట్ కౌంట్ పెంచేసే జ్యూస్.. డెంగ్యూ నుంచి త్వరగా రికవరీ అవొచ్చు..
దిశ, ఫీచర్స్ : డెంగ్యూ కేసులు పెరుగుతున్నందున కోలుకునేందుకు సరైన ఆహారం కీలకమని గుర్తుంచుకోవడం ముఖ్యం. కొన్ని రకాల పండ్లు, కూరగాయల రసాలు ప్లేట్ లెట్స్ సంఖ్యను పెంచుతాయని.. రోగ నిరోధక శక్తిని బూస్ట్ చేస్తాయని చెప్తున్నారు నిపుణులు. ఇవి వేగంగా కోలుకునేందుకు సహాయపడుతుండగా.. అవేంటో చూద్దాం.
బచ్చలికూర, కాలే జ్యూస్
బచ్చలికూర, కాలే వంటి ఆకు కూరల్లో విటమిన్ కె సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. డెంగ్యూ సమయంలో కోలుకోవడానికి సహాయపడుతుంది.
బీట్‌రూట్, అల్లం, పుదీనా జ్యూస్
బీట్‌రూట్ ఐరన్, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది, అల్లం, పుదీనా రోగనిరోధక శక్తి, జీర్ణక్రియకు మద్దతు ఇస్తాయి. వీటన్నింటినీ జ్యూస్ గా తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్ పునరుత్పత్తికి సహాయపడుతుంది.
గుమ్మడికాయ రసం
గుమ్మడికాయ 'విటమిన్ ఎ'కు అద్భుతమైన మూలం. కాగా ఇది ప్లేట్‌లెట్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. డెంగ్యూ రికవరీ సమయంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
దానిమ్మ రసం
ఇనుము అధికంగా ఉండే దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్లేట్‌లెట్ కౌంట్‌ను మెరుగుపరచడమే కాకుండా, డెంగ్యూ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
గిలోయ్ జ్యూస్
గిలోయ్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని డిటాక్సిఫికేషన్ చేస్తుంది. ప్లేట్‌లెట్ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది. ఉసిరి లేదా అల్లంతో కలిపినప్పుడు.. అదనపు యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలను అందిస్తుంది.
బొప్పాయి ఆకు రసం
బొప్పాయి ఆకు రసం ప్లేట్‌లెట్ కౌంట్‌ను గణనీయంగా పెంచుతుందని.. అలసట, బలహీనత వంటి డెంగ్యూ లక్షణాలను తగ్గిస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడింది.
గోధుమ గడ్డి జ్యూస్
గోధుమ గడ్డి క్లోరోఫిల్, విటమిన్స్ కు గొప్ప మూలం. ఇది ప్లేట్‌లెట్ స్థాయిలను పెంచడానికి.. శరీరం పునరుద్ధరణ ప్రక్రియకు మద్దతు ఇస్తుంది.
అలోవెరా జ్యూస్
కలబంద శరీరాన్ని డిటాక్సిఫికేషన్ చేయడంలో సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. డెంగ్యూ సమయంలో మెరుగైన ప్లేట్‌లెట్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది.
ఆరెంజ్ జ్యూస్
'విటమిన్ సి' సమృద్ధిగా ఉన్న ఆరెంజ్ జ్యూస్ ప్లేట్‌లెట్ పనితీరును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక ప్రతిస్పందనను పెంచుతుంది. డెంగ్యూ జ్వరం నుంచి త్వరగా కోలుకునేందుకు హెల్ప్ చేస్తుంది.