‘స్వదేశీ మేళా’కు గవర్నర్‌కు ఆహ్వానం

by Gantepaka Srikanth |
‘స్వదేశీ మేళా’కు గవర్నర్‌కు ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్వదేశీ జాగరణ మంచ్, స్వావలంబి భారత్ అభియాన్ తెలంగాణ ప్రాంతం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో అక్టోబర్ 23 నుంచి 27 వరకు నిర్వహించనున్న ‘స్వదేశీ మేళా’కు రావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను స్వదేశీ జాగరణ మంచ్ బృందం ఆహ్వానించింది. ఈ మేరకు రాజ్ భవన్‌లో గురువారం స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ కేశవ్ సోని ఆధ్వర్యంలో బృందం సభ్యులు గవర్నర్‌ను కలిసి ఆహ్వానాన్ని అందించారు. కాగా స్వదేశీ పారిశ్రామిక వేత్తలకు, వినియోగదారులకు మధ్య సరైన సంబంధాలు ఏర్పాటు చేసే వేదికగా జరగనున్న ఈ మేళాను నిర్వహిస్తున్న స్వదేశీ జాగరణ మంచ్ ను గవర్నర్ అభినందించినట్లు వారు తెలిపారు. ఇదిలా ఉండగా స్వదేశీ మేళా ఆత్మ నిర్భర భారత్ దిశగా కొనసాగుతోందన్నారు.

భారత సంస్కృతిని ప్రతిబింబిస్తూ, వివిధ రంగాలకు చెందిన స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిని బలోపేతం చేయడమే కాకుండా స్థానికంగా తయారు చేసిన ఉత్పత్తులను ప్రోత్సహించి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు సోని చెప్పారు. గవర్నర్ ను కలిసిన వారిలో స్వదేశీ జాగరణ మంచ్ క్షేత్ర సంయోజక్ సత్తు లింగమూర్తి, తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి రచ్చ శ్రీనివాస్, తెలంగాణ ప్రాంత కన్వీనర్ ముక్క హరిబాబు, కో కన్వీనర్ సిద్దుల అశోక్, స్వదేశీ మేళా కన్వీనర్ ఇంద్రసేనారెడ్డి ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed