జీతం కాదు జీవితం ముఖ్యం..శాలరీ కన్నా ఆనందానికే యూత్ ఓటు.. కంపెనీల్లోనూ మార్పు..??

by Sujitha Rachapalli |   ( Updated:2024-10-18 14:40:52.0  )
జీతం కాదు జీవితం ముఖ్యం..శాలరీ కన్నా ఆనందానికే యూత్ ఓటు.. కంపెనీల్లోనూ మార్పు..??
X

దిశ, ఫీచర్స్ : ఎంత ఎక్కువ సంపాదిస్తే సొసైటీలో అంత రెస్పెక్ట్. బంధువులు, స్నేహితుల దగ్గర గొప్ప. అందరికీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బు మాత్రమే ఇంపార్టెంట్ కానీ సదరు ఉద్యోగి అనుభవించే ఒత్తిడి గురించి పట్టించుకునే ఛాన్సే లేదు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరు కూడా శాలరీ ఎంత అనే అడుగుతారు తప్ప సంతోషంగా ఉన్నావా అని అడిగేనాథులే ఉండరు. ఉద్యోగులు కూడా ఎంత స్ట్రెస్ అనుభవించినా.. ఇంట్లో, సొసైటీలో పరపతి, పరువు అంటూ మానసికంగా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. వర్క్ ప్లేస్ లో తలకు మించిన భారం మోస్తూ మానసికంగా కుమిలిపోతుంటారు. అయితే ఈ పరిస్థితిలో మార్పు వస్తున్నట్లు కనిపిస్తుందని అంటున్నారు నిపుణులు.

యూత్ జీతం కన్నా జీవితమే ముఖ్యమనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచేసుకోవడం కన్నా ఆరోగ్యం విషయంలో బాగుండటమే బెటర్ అనుకుంటున్నారు. అందుకే నెలకు పది లక్షలు ఇచ్చి భుజాల మీద మోయలేని భారాన్ని అందించే జాబ్స్ కన్నా స్వేచ్ఛగా తమ లైఫ్ ను తమకు నచ్చినట్లుగా అనుభవించే ఉద్యోగలకే ఓటు వేస్తున్నారు. జీతం తక్కువైనా పర్లేదు వ్యక్తిగత జీవితం కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసేందుకు సిద్ధంగా లేమని చెప్తున్నారు. దాదాపు 75% మంది భారతీయ యువకులు ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. నేటి భారత యువత ఈ విధంగా కెరీర్ టార్గెట్స్ రీడిఫైన్ చేస్తున్నాయని అంటున్నాయి.

అధిక జీతం ఇచ్చే కంపెనీలు ఉద్యోగులను ఎక్కువ పనిగంటలకు డిమాండ్ చేస్తున్నాయి. అంటే మనీ విషయంలో మహాగొప్పగా ఉన్న డిమాండింగ్ వర్కింగ్ హవర్స్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అందుకే హైయెస్ట్ శాలరీల కన్నా వర్క్ - లైఫ్ బ్యాలెన్స్ కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. డబ్బు ప్రతీది ఇవ్వలేదని గుర్తిస్తూ.. అనువైన పని వాతావరణం, వ్యక్తిగత సమయం, శ్రేయస్సును విలువైనదిగా భావిస్తున్నారు. జీతం మాత్రమే తమ విజయం కాదని.. అంతకు మించిన జీవితమే అసలైన సక్సెస్ అనే నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నారు. ఈ మార్పు పరిపక్వ శ్రామిక శక్తిని సూచిస్తుంది. కంపెనీలు తమ ఉద్యోగుల మారుతున్న ఆలోచనకు అనుగుణంగా మారాల్సిన అవసరాన్ని ఎత్తి చూపుతుంది.

లింక్డ్‌ఇన్ సర్వే ప్రకారం, 75% భారతీయ యువత జీతం కంటే పని-జీవిత సమతుల్యతకు ప్రాధాన్యతనిస్తూ.. ఈ ట్రెండ్ కొనసాగిస్తున్నారని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా 60% మంది నిపుణులు ఎక్కువ గంటల కారణంగా బర్న్‌అవుట్‌ను అనుభవిస్తున్నారని.. అందువల్లే ఈ మార్పు మొదలైందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఈ ధోరణి పరిపక్వత చెందుతున్న శ్రామిక శక్తిని సూచిస్తుంది, విజయం సంపూర్ణమైనదని గుర్తిస్తుంది. ఉద్యోగి శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తూ కంపెనీలు ఈ మార్పుకు ప్రతిస్పందించాలని అంటున్నారు నిపుణులు.

యువత విజయాన్ని పునర్నిర్వచించడాన్ని కొనసాగిస్తున్నందునా.. భారతదేశ శ్రామిక శక్తి మరింత సమతుల్యంగా, ఉత్పాదకతతో, సంతృప్తికరంగా మారుతుంది. కాబట్టి సౌకర్యవంతమైన పని ఏర్పాట్లను అవలంబించే, శ్రేయస్సు సంస్కృతిని పెంపొందించే, వ్యక్తిగత వృద్ధిని ప్రోత్సహించే కంపెనీలు మాత్రమే అత్యుత్తమ ప్రతిభను పొందగలవు. నిలుపకోగలవు. కాబట్టి ఇప్పటికైనా కంపెనీలు జాగ్రత్త పడాలి. వర్క్ ఎన్విరాన్మెంట్, ఎంప్లాయీస్ వెల్నెస్ పై దృష్టిపెట్టాలి.

Advertisement

Next Story