విరాట్ స్థానంలో రెహానేనా? పుజారానా?.. రోహిత్ ఆన్సర్ ఇదే..!

by Shamantha N |
విరాట్ స్థానంలో రెహానేనా? పుజారానా?.. రోహిత్ ఆన్సర్ ఇదే..!
X

దిశ, స్పోర్ట్స్: స్వదేశంలో జరిగే ఇంగ్లాండ్ టెస్టు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి రెండు టెస్టుల్లో విరాట్ స్థానంలో ఎవరు ఆడతారనేది సస్పెన్స్ గా మారింది. దీనిపై రోహిత్ మాట్లాడుతూ.. పుజారా, అజింక్యా రహానేలలను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. టీమ్ మేనేజ్ మెంట్, సెలక్టర్లు ఎక్స్ పీరియన్స్ డ్ ప్లేయర్లతో పాటు యువకుల పేర్లను పరిశీలించినట్లు తెలిపారు. కానీ టీమ్ మేనేజ్ మెంట్ యువకుల పేర్లతోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

కోహ్లి లేని లోటు భర్తీ చేసేందుకు ఎక్స్ పీరియన్స్ ప్లేయర్లను తీసుకోవాలనుకున్నట్లు తెలిపాడు. కానీ యంగ్ ప్లేయర్లకు కూడా అవకాశాలు ఇస్తామని స్పష్టం చేశాడు. ఈ సిరీస్ తోనే టెస్టు క్రికెట్ లోకి ప్లేయర్లు అరంగేట్రం చేయొచ్చని హింట్ ఇచ్చాడు రోహిత్. స్వదేశంలోనే టెస్టు క్రికెట్ తో సుపరిచితం కావాలని ప్లేయర్లు కోరుకుంటారన్నాడు.

టెస్టు సిరీస్ లో నాలుగో స్థానం కోసం అనేక అప్షన్స్ ఉన్నాయి. స్పిన్ కు అనుకూలమైన పిచ్ లు కావడంతో శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానానికి మంచి ప్రత్యామ్నాయం. భారత- ఎ జట్టు నుంచి కూడా ప్లేయర్లను తీసుకునే ఛాన్స్ ఉంది. సర్పరాజ్ ఖాన్, ధ్రువ్ జురైల్ ఫుల్ ఫాంలో ఉండగా.. ఏ స్థానంలోనైనా ఆడేందుకు అభిమన్యు ఈశ్వరన్ సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ స్థానంలో ఎవరు ఆడతారనే దానిపై స్పష్టత రాలేదు. కాగా.. రజత్ పాటిదార్ ను టెస్టుల్లోకి పిలిచే ఛాన్స్ ఉంది.

మరోవైపు పుజారా ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో సంచలనం సృష్టిస్తున్నాడు. ఇటీవలే 20 వేల పరుగుల మైలు రాయిని దాటాడు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ తర్వాత ఈ రికార్డు అందుకున్న నాలుగో ప్లేయర్ పుజారా.

Advertisement

Next Story

Most Viewed