IND Vs ENG: విజృంభించిన అశ్విన్, కుల్దీప్.. పేకమేడలా కూలిన ఇంగ్లాండ్ మిడిలార్డర్, టీమిండియా స్కోర్ ఎంతంటే?

by Shiva |
IND Vs ENG: విజృంభించిన అశ్విన్, కుల్దీప్.. పేకమేడలా కూలిన ఇంగ్లాండ్ మిడిలార్డర్, టీమిండియా స్కోర్ ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా మొదటి రోజు పట్టు బిగించింది. కెరీర్‌లో వందో టెస్ట్ ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ 51 పరుగులిచ్చి 4 వికెట్లు, మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 72 పరుగులిచ్చి 5 వికెట్లు నేలకూల్చడంతో ఇంగ్లాండ్ 57.4 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. అంతకు ముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఓపెనర్‌ జాక్‌ క్రాలే (79; 108 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా మిగిలిన బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్ సాధించలేదు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. తొలిరోజు ఆట ముగిసేసరికి 1 వికెట్ కోల్పోయి 135 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (57; 58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ (52; 83 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వన్డే స్టైల్‌లో ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. ఈ క్రమంలోనే యశస్వి జైస్వాల్ షోయబ్ బషీర్ బౌలింగ్‌లో స్టంప్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శుభ్‌మన్ గిల్ (26; 39 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో రోహిత్‌తో కలిసి క్రీజులో ఉన్నారు.

Advertisement

Next Story