భారత్ భారీ విజయం

by Mahesh |   ( Updated:2023-02-11 08:56:03.0  )
భారత్ భారీ విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: నాగపూర్ వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫి 2023లో భారత జట్టు 132 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్.. కేవలం 177 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 400 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 223 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లను భారత స్పిన్నర్లు ముచ్చెమటలు పట్టించారు. ఆస్ట్రేలియా జట్టు 100 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఆస్ట్రేలియా జట్టు పై భారీ విజయం సాధించింది. ఈ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు.. అశ్విన్ 5 వికెట్లు, జడేజా 2, షమీ 2, అక్షర్ 1 వికెట్లు తీశారు.

Advertisement

Next Story