- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Smriti Mandhana : ఐసీసీ ర్యాంకింగ్స్.. మూడో ర్యాంక్‌లో టీమిండియా ఓపెనర్..
న్యూఢిల్లీ: ఐసీసీ ఉమెన్స్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన తన ర్యాంక్‌ను కాపాడుకున్నది. టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌కు ఆమె గాయం కారణంగా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో 715 రేటింగ్ పాయింట్లతో స్మృతి మూడో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) ప్లేయర్స్ వేలంలో స్మృతి మంధాన ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ అత్యధికంగా రూ. 3.40 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తొలి వేలంలో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. స్మృతితోపాటు షెఫాలీ వర్మ 10వ ర్యాంక్‌ను పదిలం చేసుకున్నది. జెమీమా రోడ్రిగ్స్ రెండు స్థానాలు ఎగబాకి 10వ ర్యాంక్‌కు చేరుకోగా.. హర్మన్‌ప్రీత్ సింగ్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని 12వ ర్యాంక్‌కు చేరుకుంది.
రిచా ఘోష్ ఆరు స్థానాలు వెనక్కినెట్టి 36వ ర్యాంక్‌లో నిలిచింది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్(52 నాటౌట్), రిచా ఘోష్(31 నాటౌట్)తో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ 2వ ర్యాంక్‌ను, స్నేహ్ రాణా 7వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ విభాగంలో దీప్తిశర్మ 2వ స్థానాన్ని పదిలం చేసుకున్నది.