- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత బౌలర్‌గా అది నాకు తెలుసు : జస్ప్రిత్ బుమ్రా
దిశ, స్పోర్ట్స్ : విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా శనివారం ఇంగ్లాండ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఇన్‌స్వింగర్లు, అవుట్ స్వింగర్లు, యార్కర్లతో బుమ్రా ప్రత్యర్థి జట్టును కుప్పకూల్చాడు. 15.5 ఓవర్లు వేసిన అతను కేవలం 45 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకే ఆలౌటైంది. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత బుమ్రా తన సక్సెస్ మంత్రను రివీల్ చేశాడు. రివర్స్ స్వింగ్‌ను ఎలా ఉపయోగించుకున్నాడో చెప్పాడు. అలాగే, ప్రత్యర్థి బ్యాటర్లను అవుట్ చేసేందుకు తన బౌలింగ్ విధానాన్ని వివరించాడు.
‘భారత్‌లో రివర్స్ సింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. భారత్‌లో పుట్టిన నాకు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు. దిగ్గజ బౌలర్ల రివర్స్ స్వింగ్, వారి బౌలింగ్ విధానాలను చూస్తూ పెరిగాను. ఈ రోజు రివర్స్ స్వింగ్‌ను నేను ఉపయోగించాను. అందుకు సంతోషంగా ఉంది. కేవలం నేను ఇన్‌స్వింగర్లు, అవుట్ స్వింగర్లు మాత్రమే వేయలేదు. యార్కర్లు కూడా వేశాను. ఓలీ పోప్ అవుటైన తర్వాత బ్యాటర్లు ఇన్‌స్వింగర్లు కోసం చూస్తున్నారని నాకు అర్థమైంది. బ్యాటర్లు ఏం చేయాలనుకుంటున్నారో అనే దానిపై నిఘా ఉంచాను. ఈ ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. దేని కోసం చూస్తున్నారో గ్రహించాను. నంబర్లకు దూరంగా ఉంటాను. రికార్డుల గురించి ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుంది. ఆటను ఆస్వాదించలేం.’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు.