World Cup 2023: చంద్రయాన్-3 విజయం.. ఈ సారి వరల్డ్‌కప్‌ టీమిండియాదే!

by Vinod kumar |
World Cup 2023: చంద్రయాన్-3 విజయం.. ఈ సారి వరల్డ్‌కప్‌ టీమిండియాదే!
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రయాన్-3 విజయంపై ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌ చేసిన ట్వీట్‌ ఆసక్తి కలిగిస్తోంది. చంద్రయాన్ -3 విజయంతో భారత్.. అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ దృవంలో అడుగు మోపిన తొలి దేశంగా ఘనత సాధించింది. 2019లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 విఫలమైన సంగతి తెలిసిందే. చివరి క్షణంలో సాంకేతిక సమస్యలు తలతెత్తడంతో చంద్రయాన్‌-2 చంద్రుడిపై క్రాష్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలతోపాటు దేశ ప్రజలందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే అదే ఏడాది భారత క్రికెట్‌ జట్టు కూడా 2019 వన్డే ప్రపంచకప్‌లో తీవ్ర నిరాశపరిచింది.

ఈ టోర్నీ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి పాలై ఇంటిముఖం పట్టింది. దీంతో ఒకేడాది భారత్‌కు రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే యాదృచ్చికంగా చంద్రయాన్‌-3, వన్డే ప్రపంచకప్‌ సరిగ్గా మళ్లీ ఒకే ఏడాది షెడ్యూల్‌ చేయబడ్డాయి. ఈ క్రమంలో చంద్రయాన్‌ 3 విజయవంతం కావడంతో.. భారత జట్టు కూడా వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంటుందని ఆర్ధం వచ్చేలా ముంబై ఇండియన్స్‌ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈసారి చంద్రయాన్-3 సక్సెస్ సాధించిందని, టీమిండియా కూడా ప్రపంచకప్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సెంటిమెంట్ కచ్చితంగా రిపీట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ భారత్‌ వేదికగా జరగనున్నది.

Advertisement

Next Story