- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఫిట్‌గా ఉంటే చాలు..రికార్డులన్నీ బుమ్రావే : జహీర్ ఖాన్
దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో జస్ర్పిత్ బుమ్రా మిరాకిల్ చేసిన విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచులో సౌతాఫ్రికాను ముప్పు తిప్పలు పెట్టడమే కాకుండా పొదుపుగా బౌలింగ్ చేసి, సరైన టైంలో కీలక వికెట్లు తీసి టైటిల్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు.తాజాగా బంగ్లాతో జరుగుతున్న టెస్టు మ్యాచులోనూ బుమ్రా సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే బుమ్రాపై భారత జట్టు మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా 400లకు పైగా వికెట్లు తీసిన 6వ భారత ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా నిలిచిన విషయం తెలిసిందే. అతని కంటే ముందు కపిల్ దేవ్ (687), జహీర్ ఖాన్ (597) ఉన్నారు.
‘బుమ్రా ప్రస్తుతం 3 ఫార్మాట్లలో కలిపి 402 వికెట్లు పడగొట్టాడు. అయితే, బుమ్రా తన ఫిట్‌నెస్‌ను ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో రికార్డులన్నింటినీ తిరగరాస్తాడు. అతని బౌలింగ్ శైలి ప్రత్యేకం.. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ తనే. ఫిట్‌నెస్‌పై కఠిన శ్రమ పెడితే చాలు. కెరీర్‌లో 400+ వికెట్లు తీయడం సాధారణ విషయం కాదు. పేసర్‌కు అత్యంత కష్టమైనది. బుమ్రా ఇలాగే ఆడితే.. భవిష్యత్తులో మరిన్ని రికార్డులను బద్దలు కొడతాడు. ప్రస్తుతం ఉన్న పేసర్లలో తనే నెంబర్ వన్ బౌలర్. అయితే, తన శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫిట్‌నెస్‌పై నిరంతరం శ్రమించాలి. ఎంత ఎక్కువగా ఆడితే.. అన్ని రికార్డులను అధిగమిస్తాడు. భారత్ పిచ్‌లపై పేస్‌ను రాబట్టడం సులువేం కాదు. కానీ, బుమ్రా వంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్‌కు పరిస్థితులతో సంబంధమే లేదు. యార్కర్లు, స్లో డెలివరీలతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టేస్తాడు’ అని జహీర్ కొనియాడారు.