ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. భారత్ తరఫున ఆమెదే టాప్ ర్యాంక్

by Vinod kumar |
ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. భారత్ తరఫున ఆమెదే టాప్ ర్యాంక్
X

న్యూఢిల్లీ : ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. మంగళవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన ఐదో స్థానంలో నిలిచింది. భారత్ తరఫున ఆమెదే టాప్ ర్యాంక్. హర్మన్‌ప్రీత్ 8వ ర్యాంక్‌ను కాపాడుకోవడంతో టాప్-10లో భారత్ నుంచి ఇద్దరు కొనసాగుతున్నారు. ఇంగ్లాండ్ క్రీడాకారిణి నాట్ స్కివర్ బ్రంట్ టాప్ ర్యాంక్‌లో ఉంది. అలాగే, భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ బౌలింగ్ విభాగంలో 6వ ర్యాంక్‌ను, ఆల్‌రౌండర్ విభాగంలో 9వ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. తాజా ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ క్రికెటర్లు తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. సౌతాఫ్రికా బౌలర్ మారిజన్నె కాప్ 8వ ర్యాంక్‌కు చేరుకోగా.. తజ్మిన్ బ్రిట్స్ 32 స్థానాలు, అన్నెకే బాష్ 71 స్థానాలు ఎగబాకారు. బంగ్లా ఓపెనర్ ఫర్గాన్ హోక్ రెండు స్థానాలను అధిగమించి కెరీర్ బెస్ట్ 13వ ర్యాంక్‌కు చేరుకోగా.. లెగ్ స్పిన్నర్ రబేయా ఖాన్ నాలుగు స్థానాలు, ఆల్‌రౌండర్ రీతు మోని బౌలింగ్ విభాగంలో 8 స్థానాలు, ఆల్‌రౌండర్ విభాగంలో నాలుగు స్థానాలు అధిగమించారు.

Advertisement

Next Story