ICC RANKINGS : కోహ్లీని వెనక్కినెట్టిన పంత్

by Harish |
ICC RANKINGS : కోహ్లీని వెనక్కినెట్టిన పంత్
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్నాడు. ఐసీసీ బుధవారం టెస్టు ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది. బ్యాటింగ్ విభాగంలో పంత్ 3 స్థానాలు ఎగబాకి విరాట్ కోహ్లీని వెనక్కినెట్టాడు. 745 రేటింగ్ పాయింట్స్‌తో 6వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో సత్తాచాటడంతోనే పంత్ ర్యాంక్ మెరుగుపడింది. తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులే చేసిన అతను.. రెండో ఇన్నింగ్స్‌లో రెచ్చిపోయాడు. 99 పరుగుల వద్ద అవుటై తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.

యశస్వి జైశ్వాల్ 4వ స్థానాన్ని కాపాడుకోగా.. కోహ్లీ ఒక్క స్థానంa కోల్పోయి 8వ ర్యాంక్‌కు పడిపోయాడు. టాప్-10లో ముగ్గురు భారత క్రికెటర్లు ఉన్నారు. రోహిత్ మూడు స్థానాలు, గిల్ నాలుగు స్థానాలు కోల్పోయారు. 15వ స్థానంలో రోహిత్, 19వ స్థానంలో గిల్ ఉన్నారు. ఇంగ్లాండ్ బ్యాటర్ జోరూట్ నం.1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో భారత బౌలర్లు తమ ర్యాంక్‌లను కాపాడుకున్నాడు. బుమ్రా టాప్ పొజిషన్‌లోనే కొనసాగుతుండగా.. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ 2వ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. జడేజా 6వ స్థానంలో ఉండగా.. కుల్దీప్ ఒక్క స్థానాన్ని మెరుగుపర్చుకుని 15వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

Advertisement

Next Story