ICC ODI Rankings: నాలుగో స్థానంలో సిరాజ్‌.. టాప్‌-10లో కుల్దీప్‌

by Vinod kumar |
ICC ODI Rankings: నాలుగో స్థానంలో సిరాజ్‌.. టాప్‌-10లో కుల్దీప్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ తాజాగా (ఆగస్ట్‌ 30) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్‌లో బాబర్‌ ఆజమ్‌ (877), బౌలింగ్‌లో జోష్‌ హాజిల్‌వుడ్‌ (705), ఆల్‌రౌండర్ల విభాగంలో షకీబ్‌ అల్‌ హసన్‌ (371) అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. బ్యాటింగ్‌ విభాగం టాప్‌-10లో భారత ఆటగాళ్లు శుభ్‌మన్‌ గిల్‌ (నాలుగో స్థానం), విరాట్‌ కోహ్లి (తొమ్మిదో ప్లేస్‌) తమ స్థానాలను పదిలంగా కాపాడుకోగా.. డస్సెన్‌, ఇమామ్‌ ఉల్‌ హాక్‌, ఫకర్‌ జమాన్‌, హ్యారీ టెక్టార్‌, డేవిడ్‌ వార్నర్‌, డికాక్‌, స్టీవ్‌ స్మిత్‌ 2, 3, 5, 6, 7, 8, 10 స్థానాల్లో ఉన్నారు.

బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్లు సత్తా చాటారు. మహ్మద్‌ సిరాజ్‌ ఓ స్థానం మెరుపర్చుకుని నాలుగో స్థానానికి ఎగబాకగా.. కుల్దీప్‌ యాదవ్‌ టాప్‌-10లోకి (10వ స్థానం) చేరాడు. మిచెల్‌ స్టార్క్‌, ముజీబ్‌, రషీద్‌, మ్యాట్‌ హెన్రీ, బౌల్ట్‌, ఆడమ్‌ జంపా, షాహీన్‌ అఫ్రిది 2, 3, 5, 6, 7, 8, 9 స్థానాల్లో నిలిచారు. ఆల్‌రౌండర్ల విభాగంలో టాప్‌-20లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. షకీబ్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్‌ నుంచి హార్దిక్‌ పాండ్యా ఒక్కడే టాప్‌-20లో (12) ఉన్నాడు.

Advertisement

Next Story