ICC ODI Rankings: పాకిస్తాన్‌కు షాకిచ్చిన టీమిండియా.. ర్యాంకింగ్‍ల్లో కిందికి నెట్టేసిన భారత్

by Vinod kumar |   ( Updated:2023-09-15 10:21:52.0  )
ICC ODI Rankings: పాకిస్తాన్‌కు షాకిచ్చిన టీమిండియా.. ర్యాంకింగ్‍ల్లో కిందికి నెట్టేసిన భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్​ 2023 టోర్నీలో టీమ్​ఇండియా దూసుకుపోతోంది. నేపాల్​, పాకిస్థాన్​, శ్రీలంకపై ఘన విజయాలు సాధించి ఫైనల్‌కు చేరింది. అయితే కీలకమైన సూపర్-4 మ్యాచ్‍లో గురువారం శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది పాకిస్థాన్.. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి తర్వాత.. తాజాగా వచ్చిన ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్‍ పాకిస్థాన్‍ను వెనక్కి నెట్టి ఇండియా పైకి ఎగబాకింది. శ్రీలంకతో ఓటమి తర్వాత ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్‍ల్లో పాకిస్థాన్ మూడో ర్యాంకుకు పడిపోయింది. 115 రేటింగ్ పాయింట్ల (3,102 పాయింట్ల)తో మూడో స్థానానికి దిగజారింది. మరోవైపు ఆసియాకప్‍లో ఫుల్ జోరు మీదు ఉన్న టీమిండియా 116 రేటింగ్ పాయింట్లతో వన్డేల్లో రెండో ర్యాంకుకు ఎగబాకింది. ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‍లో దుమ్మురేపుతున్న ఆస్ట్రేలియా 118 పాయింట్లతో ఇటీవలే టాప్ ర్యాంకుకు చేరింది. ఆసియాకప్ 2023 టోర్నీలో వన్డే నంబర్ వన్ ర్యాంకర్‌గా అడుగుపెట్టిన బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్థాన్.. ఇప్పుడు టోర్నీ నుంచి నిష్క్రమించడమే కాకుండా ర్యాంకింగ్‍ల్లో మూడో స్థానానికి పడిపోయింది.

బెస్ట్ టీమ్‌గా భారత్..

అన్ని జట్ల కంటే ప్రస్తుతం టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్‍ల్లో బెస్ట్ టీమ్‍గా ఉంది. టెస్టులు, టీ20ల్లో టాప్ ర్యాంకులో ఉన్న భారత్.. ఇప్పుడు వన్డేల్లోనూ రెండో స్థానానికి చేరింది. నేడు బంగ్లాదేశ్‍తో జరిగే మ్యాచ్‍తో పాటు.. ఆదివారం జరిగే ఆసియాకప్ 2023 ఫైనల్‍లో శ్రీలంకను ఓడిస్తే వన్డేల్లోనూ టీమిండియా టాప్ ర్యాంకుకు చేరే అవకాశం ఉంటుంది. ఓవరాల్‍గా అన్ని ఫార్మాట్‍ల ర్యాంకింగ్‍లను పరిశీలిస్తే టీమిండియా ఇప్పుడు కూడా బెస్ట్ టీమ్‍గా ఉంది. వన్డే ప్రపంచకప్ ముగింట భారత్ మెరుగైన ప్రదర్శన చేస్తుండటం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ (అక్టోబర్ 5 - నవంబర్ 19) భారత్ వేదికగా జరగనుండటంతో టీమిండియానే హాట్ ఫేవరెట్‍గా ఉంది.

Advertisement

Next Story