ICC CWC Qualifier 2023: అమెరికాకు బిగ్‌ షాక్‌.. నేపాల్‌ సంచలన విజయం

by Vinod kumar |
ICC CWC Qualifier 2023: అమెరికాకు బిగ్‌ షాక్‌.. నేపాల్‌ సంచలన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ICC CWC Qualifier 2023లో భాగంగా హరారే వేదికగా యూఎస్‌ఏ(అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నేపాల్‌ ఘన విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యాన్ని కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 43 ఓవర్లలో ఛేదించింది. నేపాల్‌ బ్యాటర్లలో భీమ్‌ షాక్రి(77) పరుగులతో రాణించగా.. కుశాల్ భుర్టెల్(39), దీపేంద్ర సింగ్‌(39) పరుగులతో రాణించారు. అమెరికా బౌలర్లలో.. టేలర్‌, ఎన్‌ పటేట్‌, సౌరభ్‌ తలా వికెట్‌ తీశారు.

అంతకు ముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన అమెరికా.. 207 పరుగులకే ఆలౌటైంది. యూఎస్ఏ బ్యాటర్లలో షాయన్ జహంగీర్(100 నాటౌట్‌) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. నేపాల్‌ బౌలర్లలో కరణ్‌ 4 వికెట్ల తీయగా.. గుల్సాన్‌ ఝా 3 వికెట్లు తీశాడు.

Advertisement

Next Story

Most Viewed