- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన ఐసీసీ.. ఎందుకో తెలుసా..?
దుబాయ్: టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో దొర్లిన తప్పిదంపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్షమాపణలు కోరింది. సాంకేతిక లోపంతో ఈ పొరపాటు జరిగిందని గురువారం వివరణ ఇచ్చింది. బుధవారం మధ్యాహ్నం ఐసీసీ వెబ్‌సైట్‌లో టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా అగ్రస్థానంలో ఉన్నట్టు చూపెట్టింది. వాస్తవానికి భారత్ రెండో రెండో స్థానంలో ఉండాల్సి ఉండగా.. ఆస్ట్రేలియా నం.1 ర్యాంక్‌ను కలిగి ఉన్నది. సాంకేతిక లోపంతో ర్యాంక్‌లు తారుమారయ్యాయి. కొన్ని గంటల తర్వాత పొరపాటును గుర్తించిన ఐసీసీ ర్యాంక్‌లను సరిచేసింది.
ఐసీసీ ర్యాంక్‌ల విషయంలో తప్పు చేయడం ఇది తొలిసారి కాదు. గత నెలలోనూ ఇదే పొరపాటు చేసింది. దాంతో భారత అభిమానులను ఆగ్రహానికి గురైంది ఐసీసీ. ఎన్నిసార్లు చేసిన తప్పులను మళ్లీ చేస్తారని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. తాజాగా ఐసీసీ దీనిపై వివరణ ఇస్తూ సాంకేతిక లోపం కారణంగా ర్యాంక్‌లు తారుమారు అయ్యాయని, అసౌకర్యానికి క్షమించాలని కోరింది. వెస్టిండీస్, జింబాబ్వే టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ర్యాంక్‌లు అప్‌డేట్ చేసే క్రమంలో ఈ పొరపాటు దొర్లిందని తెలిపింది. కాగా, ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టులో భారత్ గెలిస్తే టాప్ పొజిషన్‌కు చేరే అవకాశం ఉంది.
- Tags
- ICC apologises