Rahul Dravid : డ్రెస్సింగ్ రూంలో క్రికెటర్ల డిస్కషన్ దాని గురించే : ద్రవిడ్

by Harish |   ( Updated:2024-07-29 13:23:52.0  )
Rahul Dravid : డ్రెస్సింగ్ రూంలో క్రికెటర్ల డిస్కషన్ దాని గురించే : ద్రవిడ్
X

దిశ, స్పోర్ట్స్ : లాస్ ఏంజిల్స్‌-2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చిన విషయం తెలిసిందే. ప్రస్తుత క్రికెటర్లు ఆ విశ్వక్రీడల్లో పాల్గొనాలని ఉత్సాహంగా ఉన్నారని టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. పారిస్ ఒలింపిక్స్‌ను తిలకించడానికి వెళ్లిన ద్రవిడ్ అక్కడ ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ద్రవిడ్ మాట్లాడుతూ.. లాస్ ఏంజిల్స్‌-2028 ఒలింపిక్స్‌ గురించి డ్రెస్సింగ్ రూంలో చర్చలు జరుగుతున్నాయని చెప్పాడు. ‘డ్రెస్సింగ్ రూంలో నేను కొన్ని చర్చలు విన్నాను. టీ20 వరల్డ్ కప్-2026, వన్డే వరల్డ్ కప్-2027తోపాటు 2028లో జరిగే ఒలింపిక్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ విశ్వక్రీడల్లో పాల్గొనాలని, గోల్డ్ మెడల్ గెలవాలని అనుకుంటున్నారు. ఆటగాళ్లు అందుకు కోసం సిద్ధమవుతారు.’ అని తెలిపాడు. అలాగే, లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల, మహిళ జట్లు కచ్చితంగా బంగారు పతకం సాధిస్తాయని జోస్యం చెప్పాడు. ‘నేను ఆడే అదృష్టం లేదు. కానీ లాస్ ఏంజిల్స్‌లో ఏదో రకంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఏది సాధ్యపడకపోతే కనీసం మీడియా జాబ్ అయినా చేస్తా.’ అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story