గ్యాంగ్‌స్టర్'లో నాకు లీడ్ రోల్ వచ్చింది: షోయబ్ అక్తర్

by Mahesh |
గ్యాంగ్‌స్టర్లో నాకు లీడ్ రోల్ వచ్చింది: షోయబ్ అక్తర్
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు 2006 లో బాలీవుడ్‌లో ఆఫర్ వచ్చినట్లు తెలిపారు. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన 'గ్యాంగ్‌స్టర్'లో తనకు ప్రధాన పాత్ర ఆఫర్ చేశారని పేర్కొన్నారు. కాగా 'గ్యాంగ్‌స్టర్' చిత్రాన్ని మహేష్ భట్ నిర్మించారు. అయితే.. గత నెల, అక్తర్ తన బయోపిక్ 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్: రేసింగ్ ఎగైనెస్ట్ ది ఆడ్స్' నుండి విడదీస్తున్నట్లు ప్రకటించాడు. దీనికి కారణం.."అభిప్రాయాలు, ఒప్పందం ఉల్లంఘన" చేశారని షోయబ్ అక్తర్ ఆరోపించారు.

Advertisement

Next Story