Sourav Ganguly| Virat Kohli: మళ్లీ మునుపటి కోహ్లీని చూస్తాం.. దాదా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Satheesh |   ( Updated:2022-08-16 08:07:33.0  )
Sourav Ganguly says Virat Kohli to find form in Asia Cup 2022
X

దిశ, వెబ్‌డెస్క్: Sourav Ganguly says Virat Kohli to find form in Asia Cup 2022| గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి.. పరుగులు చేయడానికి ఇబ్బందులు పడుతోన్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ క్లోహీకి బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ అండగా నిలిచాడు. ఈ నెలలో ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వస్తాడని.. మరోసారి మునుపటి కోహ్లీని చూస్తామని దీమా వ్యక్తం చేశారు. విరాట్ గొప్ప ఆటగాడని.. ఇప్పటికే అతడు ఇండియా కోసం వేల పరుగులు చేశాడని అన్నారు. కోహ్లీ ఆసియా కప్‌లో పుంజుకుని.. తిరిగి ఫామ్‌లోకి వస్తాడనే నమ్మకం నాకు ఉందని పేర్కొన్నాడు. కాగా, రన్ మెషిన్‌గా పేరుగాంచిన కోహ్లీ సెంచరీ చేయక దాదాపు మూడు సంవత్సరాలు కావస్తోంది. ఇక కోహ్లీ టీమిండియా తరుఫున చివరగా ఇంగ్లండ్ టూర్‌లో ఆడాడు. విరామం అనంతరం మళ్లీ ఆసియా కప్‌లో బరిలోకి దిగనున్నాడు.

ఇది కూడా చదవండి: సూర్యకుమార్‌ను డివిల్లియర్స్‌తో పోల్చిన ఆసీస్ మాజీ కెప్టెన్

Advertisement

Next Story