- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోహ్లీతో చాట్ చేస్తా.. అతనితో పరిచయం నా అదృష్టం : జకోవిచ్
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన గురించి మాట్లాడటం గౌరవంగా ఫీలవుతానని 24 గ్రాండ్‌స్లామ్స్ విజేత, సెర్బియా టెన్నిస్ దిగ్గజం నోవాక్ తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జకో.. కోహ్లీతో తనకున్న ఫ్రెండ్‌షిప్ గురించి వివరించాడు. కోహ్లీతో కొంతకాలంగా తనకు పరిచయం ఉందని, అతనితో కమ్యూనికేట్ అయ్యే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పాడు. ‘కోహ్లీతో కొంతకాలంగా చాట్ చేస్తున్నా. అయితే, అతన్ని ఇప్పటివరకు కలిసే అవకాశం రాలేదు. అతను నా గురించి మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నా. కోహ్లీ తన కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించాడు. అతడిని నేను ఎప్పుడూ అభినందిస్తా.’ అని జకోవిచ్ చెప్పాడు. అలాగే, భారత్ వెళ్లడం కోసం తాను ఎదురుచూస్తున్నట్టు తెలిపాడు. ‘నా జీవితంలో ఒక్కసారే భారత్‌కు వెళ్లాను. అప్పుడు నా వయసు 10-11 ఏళ్లు ఉండొచ్చు. ఢిల్లీలో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడటానికి వెళ్లా. భవిష్యత్తులో నేను భారత్ వెళ్లాలనుకుంటున్నా. ఎంతో చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికత ఉన్న భారత్‌లో పర్యటించాలని కోరిక.’ అని జకోవిచ్ తెలిపాడు. కాగా, గతేడాది యూఎస్ ఓపెన్ విజేతగా నిలవడం ద్వారా 24వ గ్రాండ్‌స్లామ్ నెగ్గిన జకోవిచ్ అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన మార్గరెట్ కోర్ట్(ఆస్ట్రేలియా) రికార్డును సమం చేసిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ నెగ్గి కొత్త చరిత్రను లిఖించాలని జకో చూస్తున్నాడు. ఆ లక్ష్యంతోనే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగుతున్నాడు. ఆదివారం జరిగే తొలి రౌండ్‌లో క్రొయేషియాకు చెందిన డినో ప్రిజ్మిక్‌తో తలపడనున్నాడు.