The Hundred League: హ్యారీ బ్రూక్‌ అరుదైన ఫీట్..

by Vinod kumar |
The Hundred League: హ్యారీ బ్రూక్‌ అరుదైన ఫీట్..
X

దిశ, వెబ్‌డెస్క్: నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌ ఆటగాడు, ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్‌ హ్యారీ బ్రూక్‌ అరుదైన ఫీట్ సాధించాడు. హండ్రెడ్‌ లీగ్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేశాడు. వెల్ష్‌ ఫైర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో బ్రూక్‌ 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. హండ్రెడ్‌ లీగ్‌ హిస్టరీలోనే ఇదే ఫాస్టెస్ట్‌ సెంచరీ. బ్రూక్‌ తన ఇన్నింగ్స్‌లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు. హండ్రెడ్‌ లీగ్‌లో చరిత్రలో (పురుషుల ఎడిషన్‌లో) ఇప్పటివరకు కేవలం ముగ్గురు మాత్రమే సెంచరీ మార్కును అందుకోగా.. బ్రూక్‌దే ఫాస్టెప్ట్‌ సెంచరీగా రికార్డైంది. 2022 సీజన్‌లో విల్‌ జాక్స్‌ (48 బంతుల్లో 108 నాటౌట్‌; 10 ఫోర్లు, 8 సిక్సర్లు), విల్‌ స్మీడ్‌ (50 బంతుల్లో 101 నాటౌట్‌; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీలు చేయగా.. బ్రూకే అతి తక్కువ బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు.

అయితే ఈ మ్యాచ్‌లో 159 పరుగుల లక్ష్య ఛేదనలో వెల్ష్‌ ఫైర్‌ ప్లేయర్లు విధ్వంసం సృష్టించారు. స్టెఫెన్‌ ఎస్కినాజీ (28 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో (39 బంతుల్లో 44; ఫోర్‌, 3 సిక్సర్లు), జో క్లార్క్‌ (22 బంతుల్లో 42 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి, తమ జట్టును 90 బంతుల్లోనే (2 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా వెల్ష్‌ ఫైర్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్రూక్‌ విధ్వంసకర శతకం వృదాయింది.

Advertisement

Next Story