తానేంటో నిరూపించిన హుడా.. సపోర్ట్‌గా నిలిచిన అక్షర్

by Mahesh |   ( Updated:2023-01-04 05:14:02.0  )
తానేంటో నిరూపించిన హుడా.. సపోర్ట్‌గా నిలిచిన అక్షర్
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంకతో జరిగిన మొదటి టీ20 లో భారత్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్‌లు శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంట వెంటనే అవుట్ అయ్యారు. అలాగే కొద్ది సేపటికే ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా కూడా అవుట్ అవ్వడం తో భారత జట్టు 14 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి పికల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన ఆల్ రౌండర్ దీపక్ హుడా తన సత్తా ఏంటో చూపించాడు. ఐపీఎల్ ఇచ్చిన అనుభవంతో నిలకడగా బ్యాటింగ్ చేస్తే శ్రీలంక బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

ఈ మ్యాచ్ లో హుడా కేవలం 23 బంతుల్లో 4 సిక్సులు, 1 ఫోర్ తో 41 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అలాగే మరోపక్క నుంచి అక్షర్ పటేల్ కూడా మంచి భాగస్వామ్యాన్ని అందించారు. కలిసొచ్చిన బాల్ ను బౌండరీ తరలిస్తూ.. హుడాకు స్ట్రైక్ ఇస్తూ అక్షర్ తన ఆల్ రౌండర్ షోను నిరూపించుకున్నాడు. అక్షర్ 20 బంతుల్లో 1 సిక్స్, 4 ఫోర్లతో 31 పరుగుల చేశాడు. దీంతో భారత్ 20 ఓవర్లకు 162/5 చేసింది. చివరి ఓవర్ జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Also Read...

అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టిన యువ ఫేసర్..

Advertisement

Next Story