- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
BWF Ranking: కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ అందుకున్న ప్రణయ్..
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ అందుకున్నాడు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి 6 ర్యాంక్‌కు చేరుకున్నాడు. మంగళవారం బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. తన కెరీర్లో అతడికిదే అత్యుత్తమ ర్యాంక్. గతంలో ఏడో ర్యాంక్‌లో నిలిచిన ప్రణయ్ఇప్పుడు ఆరో ర్యాంక్‌లో నిలిచాడు.
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ఇతర భారత షట్లర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. లక్ష్య సేన్.. తాజా ర్యాంకింగ్స్‌లో ఓ స్థానం నష్టపోయి 12వ స్థానంలో నిలిచాడు. ఇక కిదాంబి శ్రీకాంత్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మొదటి రౌండ్లోనే నిష్క్రమించినప్పటికీ.. 20వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు.. ఓ స్థానం ఎగబాకి 14వ ర్యాంక్‌లో నిలిచింది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో సాత్విక్- చిరాగ్ జోడీ ప్రపంచ రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకోగా.. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ జోడీ రెండు స్థానాలు మెరుగై 17వ ర్యాంక్ దక్కించుకుంది.
𝗦𝗼𝗮𝗿𝗶𝗻𝗴 𝘁𝗼 𝗻𝗲𝘄 𝗵𝗲𝗶𝗴𝗵𝘁𝘀 🤩🔝#BWFWorldChampionships 🥉 medallist @PRANNOYHSPRI achieves his new career-high rank 🥳
— BAI Media (@BAI_Media) August 29, 2023
📸: @badmintonphoto @himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #BWFWorldRankings#IndiaontheRise#BadmintonTwitter#Badminton pic.twitter.com/KKCdM4lzJm