అతను బాక్సాఫీస్ క్రికెటర్.. వచ్చే ఏడాది కూడా చెలరేగుతాడు

by Harish |
అతను బాక్సాఫీస్ క్రికెటర్.. వచ్చే ఏడాది కూడా చెలరేగుతాడు
X

sports

న్యూఢిల్లీ : గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఏడాది కాలంగా ఆటగా దూరమయ్యాడు. గాయాల నుంచి కోలుకుంటున్న అతను త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్-2024 సీజన్‌కు అతను అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. తాజాగా రిషబ్ పంత్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్‌ను బాక్సాఫీస్ క్రికెటర్‌గా అభివర్ణించిన నాజర్.. అతను తిరిగి వచ్చిన తర్వాత కూడా సత్తాచాటుతాడని తెలిపాడు. ‘రిషభ్‌ పంత్‌‌కు జరిగింది ఘోర ప్రమాదం. ఆ సమయంలో క్రికెట్ ప్రపంచం ఆందోళనకు గురైంది. అతను కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అతను మెల్లగానే నడిచే దృశ్యాల నుంచి జిమ్‌లో పాల్గొనడం, క్రికెట్ ఆడే దృశ్యాలను సోషల్ మీడియాలో చూశాను. ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్ కోచ్‌ రికీ పాంటింగ్‌తో కలిసి యాషెస్‌ సిరీస్ కోసం ప్రయాణించా. పంత్ రికవరీపై పాంటింగ్ ప్రత్యేక ఫోకస్ పెట్టాడు. ఆ సమయంలో పంత్‌కు రెగ్యులర్‌గా మెసేజ్ చేసేవాడు. ప్రమాదానికి గురికాకముందు పంత్ బాక్సాఫీస్ క్రికెటర్. తిరిగి వచ్చిన తర్వాత కూడా అతను అదే దూకుడును కొనసాగిస్తాడని ఆశిస్తున్నా.’ అని నాజర్ చెప్పుకొచ్చాడు. కాగా, గతేడాది డిసెంబర్ 30న పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా అతను ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

Advertisement

Next Story