- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్మనీతో సిరీస్‌కు భారత హాకీ జట్టు ఖరారు.. వారిద్దరూ తిరిగి టీమ్‌లోకి..
దిశ, స్పోర్ట్స్ : సొంతగడ్డపై జర్మనీతో జరగబోయే రెండు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌కు భారత పురుషుల హాకీ జట్టును హాకీ ఇండియా ఆదివారం ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలో 22 మందితో కూడిన జట్టును వెల్లడించింది. మిడ్ ఫీల్డర్ వివేక్ సాగర్ ప్రసాద్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అలాగే, లైంగిక ఆరోపణలతో ఫిబ్రవరిలో జాతీయ జట్టుకు దూరమైన డిఫెండర్ వరుణ్ కుమార్ తిరిగి జట్టులోకి వచ్చాడు. లైంగిక ఆరోపణల కేసు నుంచి బయటపడిన తర్వాతే వరుణ్ తిరిగి జట్టులోకి వచ్చాడని హాకీ ఇండియా వర్గాలు ధ్రువీకరించాయి. అలాగే, ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీకి విశ్రాంతినిచ్చిన మన్‌దీప్ సింగ్ తిరిగి స్థానం సంపాదించాడు. అయితే, మిడ్‌ఫీల్డర్ హార్దిక్ సింగ్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. రాజిందర్ సింగ్, ఆదిత్య అర్జున్ తొలిసారిగా జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకున్నారు. న్యూఢిల్లీలో ఈ నెల 23, 24 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
భారత హాకీ జట్టు
గోల్‌కీపర్స్ : కిృషన్ బహదూర్ పాఠక్, సురాజ్, డిఫెండర్స్ : జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, హర్మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), వరుణ్ కుమార్, సంజయ్, సుమిత్, నీలం సంజీప్, మిడ్‌ఫీల్డర్స్ : మన్‌ప్రీత్ సింగ్, వివేక్ సాగర్, విష్ణుకాంత్, నీలకంఠ, శంషేర్ సింగ్, మహ్మద్ రహీల్ మౌసీన్, రాజిందర్ సింగ్, ఫార్వార్డ్స్ : మన్‌దీప్ సింగ్, అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్, ఆదిత్య అర్జున్, దిల్‌ప్రీత్ సింగ్, శిలానంద లక్రా.
- Tags
- #Hockey