విరాట్ కోహ్లీ ఎన్ని సెంచరీలు కొడతాడో చెప్పేసిన పాక్ మాజీ క్రికెట‌ర్..

by Vinod kumar |
విరాట్ కోహ్లీ ఎన్ని సెంచరీలు కొడతాడో చెప్పేసిన పాక్ మాజీ క్రికెట‌ర్..
X

దిశ, వెబ్‌డెస్క్: విరాట్ కోహ్లీ సెంచరీలపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆసీస్‌తో జరిగిన చివరి టెస్టులో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో సెంచరీతో అదరకొట్టాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ సెంచరీల సంఖ్య 75 కి చేరింది. అయితే అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో సచిన్ తర్వాత రెండో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు.

క‌చ్చితంగా వంద సెంచ‌రీల మార్క్‌ను విరాట్ కోహ్లీ రీచ్ అవుతాడని జోస్యం చెప్పాడు. కోహ్లీ ఓ బీస్ట్‌లా ప‌రుగుల ప్రవాహాన్ని సృష్టిస్తాడ‌ని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ మొత్తం 110 సెంచ‌రీలు కొట్టగ‌ల‌డ‌న్న న‌మ్మకం త‌న‌కు ఉంద‌ని అన్నాడు. కెప్టెన్సీ ఒత్తిడి తగ్గడంతో కోహ్లీ ఫ్రీగా ఉన్నాడ‌ని.. ఇప్పుడు ఎంతో ఫోక‌స్‌తో ఇన్నింగ్స్ ఆడతాడ‌ని అంచనా వేశాడు.

Advertisement

Next Story