- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హ్యాట్రిక్ డక్.. సూర్యకు రోహిత్ శర్మ మద్దతు!
దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ నెంబర్ వన్ టీ20 బ్యాటర్, టీమిండియా 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం వరుసగా నిరుత్సాహపరుస్తున్నాడు. టీ20ల్లో ధనాధన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న సూర్య.. వన్డే ఫార్మాట్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. క్రీజులో అడుగుపెట్టిన మొదటి బంతి నుంచే బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడే సూర్య.. హ్యాట్రిక్ గోల్డెన్ డక్స్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా గోల్డెన్ డక్స్ అయ్యి.. ఎవ్వరూ కోరుకోని చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. నెట్టింట తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో సూర్య వైఫల్యంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఆయనకు మద్ధతుగా నిలిచాడు. మూడు వన్డేల సిరీస్‌లో కేవలం మూడు బంతులు మాత్రమే ఆడటం దురదృష్టకరమని చెప్పాడు. అద్భుతమైన బంతులకు సూర్య ఔటయ్యాడని వెనకేసుకొచ్చాడు.
‘‘స్పిన్‌ను సూర్య బాగా ఆడగలడు. చాలా ఏళ్లుగా అతడి ఆటను చూస్తున్నాం. అందుకే లోయర్ ఆర్డర్‌లో పంపించాం. చివరి 15-20 ఓవర్లు ఆడతాడని భావించాం. కానీ తొలి బంతికే ఔట్ అవ్వడం దురదృష్టకరం. అలా ఎవరికైనా జరుగుతుంది. అంత మాత్రాన అతని సత్తా తగ్గినట్లు కాదు’’ అని చెప్పుకొచ్చాడు. సూర్య తిరిగి పుంజుకుంటాడన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.