- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హ్యారీ బ్రూక్ రికార్డుల మోత : ఫుల్ జోష్ లో సన్‌రైజర్స్
దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ 23 ఏళ్ల వయసులోనే అదరగొడుతున్నాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌లోకి జనవరి 2022లో అరంగేట్రం చేసిన ఇతను ఏడు నెలల్లోనే అతను క్రికెట్‌లోని ఇతర రెండు ఫార్మాట్‌లలో కూడా అరంగేట్రం చేశాడు. ఈ ఆటగాడు టీ20, వన్డేల్లో యావరేజ్ ప్రదర్శన ఇస్తున్నాడు, కానీ టెస్ట్‌లో మాత్రం బ్యాట్స్‌మన్ గణాంకాలు అందుకు భిన్నంగా ఉన్నాయి.
హ్యారీ బ్రూక్ ప్రస్తుతం తన ఐదో టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మౌంట్ మౌంగనుయ్ టెస్టు తొలి రోజున అతను 81 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అతను తన గత నాలుగు టెస్టుల్లోనూ అదే రీతిలో పరుగులు సాధిస్తున్నాడు. విశేషం ఏమిటంటే ఐదు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఏడు ఇన్నింగ్స్‌లలో అతని బ్యాటింగ్ సగటు ఏకంగా 81.28గా ఉంది. అతని స్ట్రైక్ రేట్ కూడా 94.51గా ఉండటం విశేషం.
ఏడు ఇన్నింగ్స్‌ల్లో అతను మూడు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలను సాధించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు టెస్ట్ క్రికెట్ ఆడుతున్న విధానానికి హ్యారీ బ్రూక్ దూకుడు ఖచ్చితంగా సరిపోతుందని అని నిరూపించుకున్నాడు. హ్యారీ బ్రూక్ ఇప్పటి వరకు కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడాడు. ఇక్కడ అతను ఇక్కడ ఎటువంటి ప్రత్యేకతను చూపించలేకపోయాడు. హ్యరీ బ్రూక్ మూడు వన్డేల్లో 28.66 సగటుతో 86 పరుగులు మాత్రమే చేశాడు. టీ20లో అతని రికార్డు మెరుగ్గా ఉన్నప్పటికీ హ్యారీ బ్రూక్ ఇప్పటివరకు 20 టీ20 మ్యాచ్‌ల్లో 17 ఇన్నింగ్స్‌లలో 26.57 బ్యాటింగ్ సగటుతో, 137.77 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 372 పరుగులు చేశాడు.
సన్‌రైజర్స్ ఫుల్ హ్యాపీ
ఐపీఎల్ 2023 కోసం గత డిసెంబర్‌లో జరిగిన వేలంలో, హ్యారీ బ్రూక్ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చాలా మంది ఫ్రాంఛైజీలు అతడిని తమ జట్టులో చేర్చుకునేందుకు ప్రయత్నించాయి. ఇక్కడ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్‌ను అత్యధిక ధర చెల్లించి తమ జట్టులో భాగం చేసింది. రూ.13.25 కోట్లకు హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో న్యూజిలాండ్ XIతో జరిగిన రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టాడు. బ్రూక్ భారత సంతతికి చెందిన ఆఫ్ స్పిన్నర్ ఆదిత్య అశోక్‌ను లక్ష్యంగా చేసుకుని ఒకదాని తర్వాత ఒకటిగా ఐదు సిక్సర్లు బాదాడు. బ్రూక్ కొట్టిన ఈ సిక్స్‌ల వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, బ్రూక్ తన మొదటి సిక్స్‌ను ఆన్ సైడ్ వైపు కొట్టడాన్ని మీరు చూడవచ్చు. దీని తర్వాత, అతను బ్యాక్‌ఫుట్‌పై వెళ్లి లెగ్ సైడ్ రెండో సిక్స్ కొట్టాడు. అనంతరం మరోసారి జోరుగా బ్యాట్ ఝుళిపించి మూడో సిక్స్ బాదాడు. దీని తర్వాత మరోసారి బ్యాక్‌ఫుట్‌పై వెళ్లి నాలుగో సిక్స్ కొట్టాడు. అదే సమయంలో అతను చివరి సిక్స్ కోసం క్రీజు నుంచి బయటకు వచ్చాడు.