- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ICC Test Rankings : రోహిత్ శర్మ ర్యాంక్ డౌన్.. జైశ్వాల్, కోహ్లీ స్థానాలు పదిలం
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ బుధవారం పురుషుల టెస్టు ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది. తాజా ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ర్యాంక్ పడిపోయింది. ఒక్క స్థానం కోల్పోయి 7వ ర్యాంక్‌లో నిలిచాడు. యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ 8వ, 10 ర్యాంక్‌లను నిలబెట్టుకున్నారు. గిల్ కూడా ఒక్క ఒక్క స్థానం కోల్పోయి 20వ ర్యాంక్‌కు పడిపోయాడు. న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్(859 పాయింట్స్) టాప్ బ్యాటర్‌గా కొనసాగుతుండగా.. జోరూట్(852 పాయింట్స్) 12 రేటింగ్ పాయింట్లను మెరుగుపర్చుకుని అగ్రస్థానానికి చేరువయ్యాడు.
బౌలింగ్ విభాగంలో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ టాప్ బౌలర్‌గా ఉండగా.. బుమ్రా 2వ, జడేజా 7వ స్థానాలను కాపాడుకున్నారు. స్పిన్నర్ కుల్దీప్ ఒక్క స్థానాన్ని అధిగమించి 14వ ర్యాంక్‌కు చేరాడు. భారత ఆటగాళ్లు మార్చిలో చివరిగా టెస్టులు ఆడారు. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొననున్నారు.
విండీస్‌పై రెండో టెస్టు విజయం తర్వాత పలువురు ఇంగ్లాండ్ ప్లేయర్లు తమ ర్యాంక్‌లను మెరుగుపర్చుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో హ్యారీ బ్రూక్ నాలుగు స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 3వ ర్యాంక్‌కు చేరుకోగా.. బెన్ డక్కెట్ ఆరు స్థానాలు, ఓలీ పోప్ 8 స్థానాలు వెనక్కినెట్టి 16వ, 21వ ర్యాంక్‌ల్లో నిలిచారు. పేసర్ క్రిస్ వోక్స్ 2021 తర్వాత తొలిసారిగా టాప్-20లోకి అడుగుపెట్టాడు. విండీస్‌పై ఆరు వికెట్లు తీసిన అతను నాలుగు స్థానాలు అధిగమించి 20వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.