నా కన్నీళ్లను దేశం చూడకూడదు.. అందుకే ఆ పని చేశా: హర్మన్ ప్రీత్ కౌర్

by Satheesh |
నా కన్నీళ్లను దేశం చూడకూడదు.. అందుకే ఆ పని చేశా: హర్మన్ ప్రీత్ కౌర్
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా వేదికగా గురువారం జరిగిన సెమీస్ పోరులో భారత్ ఆసీస్ చేతిలో పోరాడి ఓడింది. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత్ సునాయసంగా విజయం సాధిస్తుందనుకున్న దశలో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్ భారత్ కొంపముంచింది. దీంతో ట్రోఫీ గెలవాలన్న భారత్ కల చెదిరిపోయింది.

ఇదిలా ఉండగా.. మ్యాచ్ అనంతరం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె సన్ గ్లాసెస్ ధరించడంపై జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీనికి హర్మన్ స్పందిస్తూ.. నా కన్నీళ్లను నా దేశం చూడకూడదని.. అది తనకు ఇష్టం లేదని.. అందుకే సన్ గ్లాసెస్ పెట్టుకున్నానని ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా తాము ఇకపై మరింత మెరుగుపడుతామని.. దేశాన్ని ఇలా మరోసారి నిరాశపర్చమని పేర్కొన్నారు. ఇక, సన్ గ్లాసెస్ పెట్టుకుని మాట్లాడుతున్న హర్మన్ ప్రీత్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story