‘స్కూల్ గర్ల్ చేసే తప్పు’ అంటూ.. ఇంగ్లండ్ లెజెండ్ చేసిన కామెంట్స్‌పై హర్మన్‌ కౌంటర్

by Vinod kumar |
‘స్కూల్ గర్ల్ చేసే తప్పు’ అంటూ.. ఇంగ్లండ్ లెజెండ్ చేసిన కామెంట్స్‌పై హర్మన్‌ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీతో రాణించిన వింత పద్ధతిలో అవుటైంది. దీనిపై ఇంగ్లండ్ మాజీ లెజెండ్ నాజర్ హుస్సేన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కామెంటరీలో ఉన్న అతను హర్మన్‌ప్రీత్ చేసింది 'స్కూల్ పిల్లలు చేసే పొరపాటు' అని విమర్శించాడు. హర్మన్ ఈ మ్యాచ్‌లో 34 బంతుల్లోనే 52 పరుగులు చేసింది.

మ్యాచ్ తర్వాత హుస్సేన్ తనపై చేసిన కామెంట్స్ పై స్పందించాల్సిందిగా మీడియా అడగగా.. దీనికి హర్మన్ స్పందిస్తూ.. అతడు అలా అన్న సంగతి తనకు తెలియదని, అయినా అది దురదృష్టకరమైన సంఘటన అని చెప్పింది. ఆటగాళ్లు సింగిల్ తీసే సమయంలో కూడా ఇలా బ్యాట్ స్టక్ అవడం చాలాసార్లు చూశా. ఇది మా దురదృష్టం అని మాత్రం ఒప్పుకుంటా' అని హర్మన్ చెప్పింది. నేను దానిని దురదృష్టంగా భావిస్తాను తప్ప అది స్కూల్ అమ్మాయి చేసే తప్పిదం కాదు. మేము చాలా పరిణతి సాధించాం. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాం. అది అతని ఆలోచనా విధానం" అని హర్మన్ స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed