ఉత్తమ మహిళా క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్..

by Vinod kumar |   ( Updated:2023-04-18 16:17:46.0  )
ఉత్తమ మహిళా క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్..
X

న్యూఢిల్లీ: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ప్రతిష్టాత్మక విజ్డన్ క్రికెటర్ అవార్డు వరించింది. విజ్డన్ క్రికెటర్స్ అల్మానాక్-2023కు సంబంధించిన అవార్డ్స్‌ను నిర్వాహకులు మంగళవారం ప్రకటించారు. అందులో భాగంగా హర్మన్‌ప్రీత్ కౌర్ ‘విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెలుచుకుంది. దాంతో ఈ అవార్డు గెలుచుకున్న తొలి భారత మహిళా క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్ చరిత్ర సృష్టించింది. గతేడాది ఆమె అద్భుత ప్రదర్శనకు గానూ ఈ అవార్డు దక్కింది. హర్మన్‌ప్రీత్ నాయకత్వంలో భారత జట్టు ఇంగ్లాండ్ గడ్డపై 3-0తో వన్డే సిరీస్ సొంతం చేసుకోవడంతోపాటు కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించింది.

అలాగే, క్రికెటర్‌గా వన్డేల్లో 754 పరుగులు, టీ20ల్లో 524 పరుగులు చేసింది. అలాగే, టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ సైతం లీడింగ్ టీ20 క్రికెటర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. గతేడాది టీ20 క్రికెట్‌లో సూర్య సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. 187.43 స్ట్రైక్ రేట్‌తో 1, 164 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలతోపాటు 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే, 68 సిక్స్‌లు బాదగా.. ఒక క్యాలెండర్ ఇయర్‌లో గతంలో ఎప్పుడు ఏ క్రికెటర్ ఈ ఘనత సాధించలేదు.

Advertisement

Next Story