తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్..

by Vinod kumar |
తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్..
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్‌(డబ్ల్యూపీఎల్) ఆరంగేట్ర సీజన్ తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు సారథి హర్మన్ ప్రీత్ కౌర్ డబ్ల్యూపీఎల్.. తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఎన్నటికీ గుర్తుండిపోయేలా.. మొట్టమొదటి హాఫ్ సెంచరీ చేసిన క్రికెటర్‌గా నిలిచింది. వరుసగా ఏడు బంతుల్లో ఏడు బౌండరీలు నమోదు చేసింది. మోనికా పటేల్ వేసిన 15వ ఓవర్‌లో చివరి నాలుగు బంతులను బౌండరీకి తరలించిన హర్మన్‌.. గార్డనర్ వేసిన మరుసటి ఓవర్‌లో రెండో బంతికే స్ట్రైక్ తీసుకొని వరుసగా మరో మూడు బౌండరీలు బాదింది.

దాంతో వరుసగా ఏడు బంతుల్లో ఏడు బౌండరీలతో 28 పరుగులు పిండుకుంది. టాస్ గెలిచిన గుజరాత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఈ క్రమంలో ముంబై సారథి హర్మన్ ప్రీత్ కేవలం 30 బంతుల్లోనే 65 పరుగులు(14 ఫోర్లు) సాధించగా.. ముంబై జట్టు అదిరిపోయేలా 208 పరుగులు భారీ లక్ష్యాన్ని గుజరాత్ జట్టు ముందు ఉంచింది. ఇక గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు తీయగా.. ఆష్లే గార్డనర్, తనూజ, జార్జియా తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed