Hardik Pandya: భార్యతో విడాకులు అనంతరం ఆ హీరోయిన్‌ను లైన్‌లో పెట్టిన స్టార్ క్రికెటర్!

by sudharani |
Hardik Pandya: భార్యతో విడాకులు అనంతరం ఆ హీరోయిన్‌ను లైన్‌లో పెట్టిన స్టార్ క్రికెటర్!
X

దిశ, సినిమా: స్టార్ క్రికెటర్, టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి నటాషా విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలను నిజం చేస్తూ.. నాలుగేళ్ల తమ వివాహ బంధానికి వీడ్కోలు పలికినట్లు సోషల్ మీడియా వేదికగా కన్ఫార్మ్ చేస్తూ.. ‘పరస్పర అంగీకారంతో ఇద్దరం విడిపోతున్నాము. మా గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వండి’ అంటూ తెలిపారు. ఈ క్రమంలోనే భార్యతో విడాకులు అనంతరం హార్దిక్ పాండ్యా మరో హీరోయిన్ ప్రేమలో పడినట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్య అనంత్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు దేశ, విదేశాల నుంచి బిజినెస్, సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. ఇందులో భాగంగా నటాసా కూడా తన బాయ్ ఫ్రెండ్‌తో మ్యారేజ్‌కు వచ్చింది. ఇక ఒంటరిగా వచ్చిన హార్దిక్ మాత్రం బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే‌తో డ్యాన్స్‌లు చేస్తూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. దీంతో అప్పటి నుంచి హార్దిక్ అనన్యాతో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మన క్రికెటర్ అనన్యాను సోషల్ మీడియాలో ఫాలో చెయ్యడం స్టార్ట్ చేశాడు. దీంతో ఈ రూమర్స్ మరింత స్ట్రాంగ్‌గా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై హార్దిక్, అనన్య ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

Advertisement

Next Story